మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి బ్యాచ్ మెట్స్ ఆర్దికసహాయం..
కానిస్టేబుల్ పాపారావు కుటుంబానికి పోలీస్ సిబ్బంది చేయూత..మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్, చేతుల మీదుగా కుటుంబసభ్యులకు ఫిక్స్ డిపాజిట్ పాస్ బుక్ అందజేత..
ఇటీవల గూడూరు లో లారీబోల్తా పడి అందులోని జామాయిల్ కర్ర మీద పడడంతో ప్రమాదంలో మరణించిన ధనసరి పాపారావు (2018 బ్యాచ్ ) వారి తోటి సహోద్యోగి కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయానికి వచ్చిన పాపారావు బ్యాచ్ కు చెందిన సిబ్బంది అంతా కలిసి రూ. 2లక్షల 25 వేల రూపాయలు విరాళాలు సేకరించి ఆ కుటుంబానికి తమ వంతు ఆర్థిక భరోసా కల్పించారు. వారు సేకరించిన డబ్బుతో పాపారావు పిల్లల పేరు మీద పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసారు.
ఈ పాలసీకి సంబంధించిన పాస్ బుక్ ను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ చేతుల మీదుగా వారి కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ..కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాస్, 2018బ్యాచ్ సిబ్బంది, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.