వరంగల్ పొలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
దేశవ్యాప్తంగా నిన్నటి నుండి అమలవుతున్న నూతన క్రిమినల్ న్యాయ చట్టాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ముమ్మర ప్రచారం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. నూతన క్రిమినల్ న్యాయ చట్టాలతో రూపోందించిన క్రిమినల్ మేజర్ యాక్ట్స్ పుస్తకాలను పోలీస్ స్టేషన్లకు పంపిణీ చేసే కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పోలీస్ అధికారులకు ఈ పుస్తకాలను అందజేసారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నూతన నేర చట్టాల ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం అందించడం జరగడంతో బాటు, సమయం ఆదా అవుతుందని. ఈ నూతన నేర చట్టాలపై అన్ని వర్గాల అవగాహన కల్పించే విధంగా తమ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రచారం జరిపించాలని సూచించారు. ఈ కార్యక్రమములో పోలీస్ శిక్షణా కేంద్రం ప్రిన్స్‌పల్ రాగ్యానాయక్, ఎసిపిలు జితేందర్ రెడ్డి, డేవిడ్‌రాజు, ఇన్స్‌స్పెక్టర్లు శ్రీధర్‌రావు, సంజీవ్,ఎస్.ఐ రాజ్‌కుమార్ పాల్గోన్నారు.