
మంగళవారం నుంచి ప్రారంభంకానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ మొదటిసారి అసెంబ్లీకి వస్తున్నారు. ఇదే రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు కేసీఆర్ అధ్యక్షతన బీఆరెస్‌ఎల్పీ భేటీ జరుగనుంది. ఈ భేటీలో బీఆరెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.అయితే అసెంబ్లీకి రానున్న కేసీఆర్ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నదానిపై మాత్రం బీఆరెస్ వర్గాలు స్పష్టతనివ్వలేదు. కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీ కి హాజరుకావాలో మాకు స్ట్రాటజీ ఉందంటూ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారో లేదో ఇప్పుడే చెప్పలేమన్నారు.